Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంబటి రాంబాబుకు మరోసారి కౌంటర్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej counter to Ambati Rambabu
Advertisement
  • అంబటి మీద జోకులు వేసేలా తమ సినిమాలో చేయలేదన్న సాయితేజ్
  • సినిమాను సినిమాగానే చూడాలని వ్యాఖ్య
  • చిరంజీవి మామయ్యతో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానన్న తేజూ
Advertisement
ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం 'బ్రో' ప్రకంపనలు పుట్టిస్తోంది. తనను టార్గెట్ చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంబటికి హీరో సాయి ధరమ్ తేజ్ మరోసారి కౌంటర్ ఇచ్చాడు. అంబటి రాంబాబు మీద జోకులు వేసే విధంగా తమ సినిమాలో డ్యాన్స్ సీన్ తీయలేదని తేజూ చెప్పాడు. సినిమాలకు, రాజకీయాలకు ముడిపెట్టవద్దని చెప్పాడు. సినిమాను సినిమాగానే చూడాలని అన్నారు. ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని సాయితేజ్ దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.

తనకు రాజకీయ అనుభవం లేదని... తమ కుటుంబ సభ్యులందరూ మామయ్య పవన్ కల్యాణ్ కు సపోర్ట్ చేస్తామని తేజూ చెప్పాడు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని తెలిపాడు. పెద్ద మామయ్య చిరంజీవితో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక షార్ట్ ఫిలిం చేశామని... దాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేస్తామని తెలిపాడు.
Advertisement
Advertisement
Sai Dharam Tej
BRO
Tollywood
Ambati Rambabu
YSRCP

More Telugu News